ఐష్‌ కార్బన్‌ కాపీ ఆరాధ్య.. ప్రూఫ్‌ ఇదిగో!

0
26

నిలువెత్తు అందానికి నిదర్శనం ఐశ్వర్యారాయ్‌. అందుకే ప్రపంచ సుందరి కిరీటం ఆమెను వరించింది. ఆమె వయసు 43 ఏళ్లయినా.. చూడడానికి మాత్రం అలా ఉండరు. 1997లో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఐష్‌ ఇప్పటికీ గ్లామర్‌ పాత్రల్లో కథానాయికగా నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఐశ్వర్య చిన్ననాటి ఫొటో ఒకటి బయటకి వచ్చింది. దాన్ని చూస్తుంటే.. అచ్చం ఐశ్వర్య గారాల పట్టి ఆరాధ్యను చూసినట్లే ఉంది. కళ్లు, అమాయకత్వం ప్రతిబింబించే ముద్దు మోము.. ఇద్దరు దాదాపు ఒకేలా ఉన్నారు. ఈ ఫొటోను సోషల్‌మీడియాలో చూసిన ఫ్యాన్స్‌ ఆరాధ్య పెద్దయ్యాక అచ్చం అమ్మలానే ఉంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు.

LEAVE A REPLY