ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు దూరం

0
19

ప్రపంచ క్రికెట్‌లో ఇన్నాళ్లూ మనదే ఆధిపత్యం..బీసీసీఐ ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. ఆదాయ పంపిణీతో పాటు ఐసీసీలో సంస్కరణల విషయంలో బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలినప్పటినుంచి మిగిలిన దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐని తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఐపీఎల్ ప్రారంభంలో బీసీసీఐకి వ్యతిరేకంగా ఏదేశ బోర్డుకూడా ఆటగాళ్లను పంపకుండా ఉంటామని ధైర్యంగా చెప్పలేకపోయాయి.. కాగా, మా దేశంలో మీ పర్యటన లేకుంటే మా క్రికెటర్లు ఐపీఎల్ ఆడబోరని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సీఈవో హరూన్ లోర్గాత్ లేఖ రాయగా.. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తన ఆటగాళ్ల విషయంలో కఠిన నిబంధనలు విధించనున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఐపీఎల్‌లో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు వచ్చే సీజన్ ఐపీఎల్ నుంచి అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం కనిపిస్తున్నది. ఐపీఎల్ కారణంగా ఆసీస్ ఆటగాళ్లు ఏడాదిలో రెండునెలలు దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉండడం లేదు.దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా సుదీర్ఘ కాంట్రాక్ట్ రూపంలో ఆటగాళ్ల ముంగాళ్లకు బంధాలేసేలా ప్రణాళికలు రచిస్తున్నది.

LEAVE A REPLY