ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు

0
44

నవోలు, నమస్తే తెలంగాణ: ఐనవోలు జాతర సంక్రాంతి నుంచి మొదలై ఉగాది వరకు నిరాటంకంగా సాగుతుంది. బోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు హాజరై మల్లన్నను దర్శించుకుంటారు. శివసత్తుల పూనకాలు, గజ్జెల లాగులు ధరించి ఒగ్గుపూజారుల డప్పుల మోతలు, ఢమరుకనాదాలతో ఈ క్షేత్రం దద్దరిల్లుతుంది. భక్తులు బోనం సమర్పించి, పట్నం వేసి మొక్కులు చెల్లించుకుంటారు. సంక్రాతి రోజు ప్రభబండ్లు తిప్పడం ఆకట్టుకుంటుంది. మార్నేని వంశస్తులు పెద్దబండి (షిడిరథం)కు రెండు జతల ఎడ్లను కట్టి పూలు,విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు

LEAVE A REPLY