ఐఎస్‌ఐ అధిపతిగా నవీద్ ముక్తార్

0
21

పాకిస్థాన్ భద్రత, రక్షణ వ్యవహారాలకు సంబంధించిన అధికార వ్యవస్థలో కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. తన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పటిష్ఠం చేసుకోవడానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చర్యలు తీసుకొంటున్నారు. గూఢచార వ్యవహారాలు చూసే ఆ దేశంలోని శక్తిమంతమైన అంతర్ సర్వీసుల నిఘా సంస్థ (ఐఎస్‌ఐ) అధిపతిని మార్చేశారు. ఇప్పటివరకు ఐఎస్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అక్తర్‌ను తొలగించి ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తార్‌ను నియమించారు. పాక్ నూతన సైనికాధిపతిగా నియమితుడైన జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాస్వామ్యవాది అయిన బాజ్వాను ఇటీవలే ప్రధాని సైనికాధిపతిగా నియమించిన సంగతి తెలిసిందే. బాజ్వా ఈ పదవిలోకి వచ్చాక మొదటి చర్యగా పాక్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఐఎస్‌ఐ చీఫ్‌ను మార్చడం గమనార్హం.

LEAVE A REPLY