ఏసీబీ వలలో ఏపీ అధికారి

0
20

ఏపీ లేబర్, ఎంప్లాయ్‌మెంట్ విభాగం జేడీ గోపురం ముని వెంకటనారాయణ ఆస్తులపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని కొత్తపేట శ్రీరామలింగేశ్వరకాలనీలోని వెంకటనారాయణ నివాసం, మణికొండలోని ఇల్లు, తిరుపతి, విజయవాడల్లోని ఆస్తుల సోదాల్లో నలుగురు డీఎస్పీలు,ఆరుగురు సీఐలు, సుమా రు 30 మంది సిబ్బంది పాల్గొన్నారు. కొత్తపేటలోని భవనంలో ఏపీ ఏసీబీ డీఎస్పీ ఎస్పీవీ ప్రసాద్‌రావు నేతృత్వంలోని అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.26 లక్షల నగదు, రూ.25 లక్షల బ్యాంకు డిపాజిట్ పత్రాలు, అరకిలో బంగారం, రూ.1.50 కోట్ల విలువైన ఇల్లు, రూ.2.65 కోట్ల విలువైన అప్పులిచ్చిన ప్రామిసరీ పత్రాలు సహా సుమారు రూ.6 కోట్ల ఆస్తులను గుర్తించారు. కొత్తపేట, మణికొండలో ఇండ్లు, 10 ప్లాట్లు, తిరుపతిలో రూ.4 కోట్లు విలువ చేసే వ్యవసాయ భూమి ఉన్నట్టుగా గుర్తించారు. విచారణ కొనసాగుతున్నది.

LEAVE A REPLY