ఏసీబీకి చిక్కిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు

0
23

నల్లగొండ జిల్లా గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) ఎస్‌ఈ రమణనాయక్‌తో పాటు అదే కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న లకా్ష్మరెడ్డి శుక్రవారం ఏసీబీకి చిక్కారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.6లక్షలు లంచం తీసుకుంటూ లకా్ష్మరెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఎస్‌ఈ రమణనాయక్ ఆదేశాల మేరకే తీసుకున్నానని చెప్పడంతో ఇద్దరిపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది ఆగస్టులో కృష్ణా పుష్కరఘాట్ల వద్ద ఆర్‌డబ్ల్యూఎస్ ఆర్‌వో(వాటర్ ట్యాంకులు) ప్లాంట్లను నిర్మించారు. నార్కట్‌పల్లి మండలం నెమ్మానికి చెందిన క్లాస్-3కాంట్రాక్టర్ వివేకానందరెడ్డి 39 పనులు పొంది పూర్తిచేశారు. తొమ్మిది పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.6లక్షలు కమీషన్ ఇస్తేనే బిల్లులు చేస్తామని ఎస్‌ఈ రమణనాయక్ తేల్చిచెప్పడంతో వివేకానందరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

శుక్రవారం పథకం ప్రకారం నల్లగొండ ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో రూ.6 లక్షలు లకా్ష్మరెడ్డికి అందజేయగా ఏసీబీ డీఎస్పీలు కోటేశ్వర్‌రావు,ప్రభాకర్‌రావు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌ఈ రమణనాయక్ ఆదేశాల మేరకే డబ్బు తీసుకున్నానని లకా్ష్మరెడ్డి చెప్పారు. దాడుల్లో సీఐలు సుదర్శన్, రమేశ్‌రెడ్డి, వెంకటేష్, మజీద్, జగన్‌మోహన్ పాల్గొన్నారు.అదే సమయంలో హైదరాబాద్‌లో ఉన్న ఎస్‌ఈ రమణను సైతం అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ కోటేశ్వర్‌రావు తెలిపారు. 2009లో పరిగిలో రమణనాయక్ ఈఈగా పనిచేస్తున్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు నమోదైన కేసు పెండింగ్‌లో ఉన్నదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here