ఏప్రిల్ 11న ప్రజలే తీర్పు ఇస్తారు

0
18

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచన దేశానికి ఆచరణగా మారిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజాప్రతినిధులపై ప్రజల్లో చులకనభావం ఏర్పడేలా చేస్తున్న చిల్లర విమర్శలు మానుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ పాలన నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పిచ్చివాడుగు మాని.. నేతలు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరుతున్నారో, లోపం ఏమిటో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. జరుగుతున్న పరిణామాలపై ప్రజలు ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పు ఇస్తారని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి క్రిశాంక్, రంగారెడ్డి డీసీఎంఎస్ మాజీ చైర్మన్ నర్సింహగుప్తాతోపాటు వికారాబాద్, కంటోన్మెంట్, భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here