ఏప్రిల్ 1- డిసెంబర్ 19 మధ్య ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.5.57 లక్షల కోట్లు

0
20

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ఎంతగానో తోడ్పడిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 19 వరకూ ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.5.57 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని, తద్వారా బడ్జెట్ అంచనాల్లో 65 శాతం ఇప్పటికే వచ్చేసిందన్నారు. ఏప్రిల్ 1- నవంబర్ 30 మధ్యకాలంలో పరోక్ష పన్నుల (కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ పన్నుల) రూపేణా రూ.7.53 లక్షల కోట్ల ఆదాయం లభించిందని వెల్లడించారు. నోట్లరద్దు నిర్ణయం అమలులోకి వచ్చి 50 రోజులైన సందర్భంగా జైట్లీ గురువారం ఢిల్లీలో విలేకర్లతో, పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడారు. నోట్లరద్దుతో ఆర్థికవ్యవస్థ కుంటుపడుతుందన్న విమర్శకుల అంచనాలు తలకిందులయ్యాయని ఆయన పేర్కొన్నారు. విమర్శకుల అంచనాలు తప్పని రుజువు చేస్తూ అన్ని రంగాల్లోనూ పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి.

LEAVE A REPLY