ఏపీ రాజధానిలో ఏడు ప్రధాన రోడ్లు

0
27

రాజధానిలో నాలుగు వరుసలతో ఏడు ప్రధాన రహదారులు నిర్మాణం జరగబోతుందని వివరించారు. తుళ్ళూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో గురువారం బేతపూడి, నవులూరి రైతులకు ప్లాట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ రైతులు సూచించిన విధంగా, కోరుకున్న ప్రాంతంలో ప్లాట్ల కేటాయింపు చేసినట్టు తెలిపారు. ప్లాట్లలో అండర్‌ గ్రౌండు కేబుల్‌, డ్రైనేజీ , సిమెంటు రోడ్లు ఇతర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రైతులు నేరుగా ప్లాట్లు అమ్ముకోవటానికి ఐటీ ప్లాట్‌ఫాం ద్వారా ఒక యాప్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధానిలో 320 కిలోమీర్ల రోడ్లను 14 నెలలో పూర్తి చేస్తామన్నారు. రాజధాని నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణనిస్తున్నట్లు గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. రాజధానిలో ఉచిత వైద్యం అందించటానికి హెల్త్‌ కార్డులు జారీచేశామన్నారు. రాజధాని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 15 లోపు ఇందుకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. అమరావతి ఫింఛన్లు అర్హులైనవారికి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా అర్హలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైతులు భూములు త్యాగం చేయటం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. అనంతరం రైతులకు ప్రొవిజన్‌ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జేసీ కృతికా శుక్లా, భూవ్యవహారాల డైరెక్టర్‌ చెన్నకేశవరావు, డిప్యూటీ కలెక్టర్లు రఘనాథరెడ్డి, లలితకుమారి, ఐటీ తహసీల్దార్‌ రవి, తుళ్లూరు తహసీల్దార్‌ సుధీర్‌బాబు, మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌ గంజి చిరంజీవి, జడ్పీటీసీ ఆకుల జయసత్య పాల్గొన్నారు.

LEAVE A REPLY