ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగాలి: ఐవైఆర్‌

0
5

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. పరిపాలన అనేది న్యాయబద్ధంగా సాగాలని సూచించారు. రాజధాని కోస్తాంధ్రలో ఉందని.. అలాగే హైకోర్టుని రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో… హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాయలసీమలో హైకోర్టు’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటుకు ఉన్న సాధ్యసాధ్యాలపై చర్చించారు

LEAVE A REPLY