ఏపీతో చేతులు కలపండి.. పారిశ్రామికవేత్తలకు బాబు పిలుపు

0
30

రాష్ర్టానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్‌ వెళ్లిన సీఎం చంద్రబాబు… ఈ దిశగా పలువురు పారిశ్రామికవేత్తలను ఒప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, సాంకేతిక, మానవ వనరులను వివరిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారు. ‘భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బలంగా ఉంది. టెక్నాలజీలో అందరికంటే ముందున్నాం. టెక్నాలజీయే మా బలం. మీ నుంచి మరిన్ని కొత్త ఆలోచనలు, సహకారం కావాలి’ అని ఇతర దేశాల ప్రతినిధులను సీఎం కోరారు.

LEAVE A REPLY