ఏపీకి హోదా ప్రస్తావనేది

0
18

రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం హామీలు, రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలపై ప్రసంగంలో లేకపోవడం శోచనీయమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావన ఉంటుందని ఆశించామని, కానీ అది లేకపోవడం బాధాకరమని అన్నారు. ఏపీ అభివృద్ధిపై కేంద్రం విఫలమైందని, విభజనతో ఏపీ నష్టపోయిందన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

LEAVE A REPLY