ఏపీకి సాయం చేస్తాం

0
24

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఇచ్చిన హామీలను నెరవేర్చటంతోపాటు మరింత సాయం అం దించటానికి కూడా కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయోత్పత్తుల భాండాగారంగా మారుతుందని భరోసా వ్యక్తం చేశారు. జాతీయ సగటుకన్నా 4-5 శాతం అధిక వృద్ధిరేటు సాధించే సామర్థ్యం ఏపీకి ఉందన్నారు. శుక్రవారం విశాఖపట్టణంలో 23వ సీఐఐ భాగస్వామ్య సదస్సు- 2వ సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సదస్సును జైట్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అత్యంత ప్రగతివంతమైన రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని, ఇక్కడ పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here