ఏడు రోడ్ల కూడలిలో కుప్పకూలిన పురాతన భవనం

0
26

హైదరాబాద్‌లో జరిగిన కొన్ని గంటల్లోపే కడపలో మరో ప్రమాదం జరిగింది. ఏడు రోడ్ల కూడలిలోని సుజాత హోటల్ బిల్డింగ్ కుప్పకూలింది. వంద ఏళ్ల నాటి ఈ భవనానికి కాలపరిమితి చెల్లినా.. ఇన్ని రోజులు పైపైన మెరుగులు దిద్దుతూ హోటల్ నడిపిస్తున్నారు. హోటల్ వంటగది భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు మహిళలు వంటగదిలో ఉన్నారు. వారికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అయితే పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఆ సమయంలో వంట గదిలో మనుషులు లేరు. ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు.

LEAVE A REPLY