ఏక్‌ విలన్‌ సీక్వెల్‌లో కృతి

0
19

‘బరేలి కి బర్ఫీ’ సినిమా విజయంతో మంచి ఊపుమీద ఉన్న కృతిసనన్‌ మరో సినిమాలో కనపడబోతోంది. అదే ‘ఏక్‌ విలన్‌’ పొడగింపు చిత్రం ‘ఏక్‌ విలన్‌-2’. మొహిత్‌ సూరి దర్శకత్వంలో ఏక్తాకపూర్‌ నిర్మించిన ‘ఏక్‌ విలన్‌’ కాసులు గట్టిగానే రాల్చింది. ‘ఐ సా ది డెవిల్‌’ అనే దక్షిణ కొరియా చిత్రం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో సిద్దార్థ మల్హోత్రా సరసన శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌లోను, ‘ఝలక్‌ దిఖలా జా’ రియాలిటీ షోలలోను ఈ సినిమాకు ప్రచారం చేశారు. ఇప్పుడు నిర్మించబోయే పొడిగింపు చిత్రంలో కృతిసనన్‌ హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం కృతి సనన్‌ ‘అర్జున్‌ పాటియాలా’లో ఒక జర్నలిస్టుగా దిల్జిట్‌ దోసంఘ్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ చండీఘర్‌లో మొదలైంది. కృతి ‘ఏక్‌ విలన్‌-2’లో నటించబోతున్న విషయాన్ని దర్శకుడు మొహిత్‌ సూరి త్వరలో ప్రకటించనున్నాడు. ఇదిలా ఉండగా సిద్దార్థ మల్హోత్రా నటించిన ‘అయ్యారి’ సినిమా కూడా ఈ పదహారున విడుదలైంది.

ఈ సినిమా చాలా కాలంగా విడుదలకు నోచుకోలేదు. కృతిసనన్‌కు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌తో దగ్గర సంబంధాలున్నాయి. ఈ విషయంలో కృతి కొంత వరకు ఒప్పుకున్నా సుశాంత్‌ మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయించాడు. పరస్పర ఆకర్షణలో నిజాయతీ ఉండాలి. అదిలేని మనిషిని గౌరవించలేం అని ఒకానొక ఇంటర్వ్యూలో కృతి స్పష్టం చేసింది. అది సుశాంత్‌ గురించి చేసిన కామెంటా లేక మనసులో మాట చెప్పిందా అనే విషయం తెలియదు. సంప్రదాయక వివాహానికి తను మొగ్గుచూపుతానని తెలిపిన కృతిసనన్‌ ఇప్పుడిప్పుడే పెళ్లి విషయం మీద ఒక నిర్ణయానికి రాలేదని, చేతిలో చాలా సినిమాలున్నాయని, ప్రస్తుత లక్ష్యం వాటిని పూర్తి చేయడమే అని చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here