ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళనుఅంగీకరించే ప్రసక్తి లేదని జయలలిత మేనకోడలు

0
16

తమిళనాడు రాజకీయ క్షేత్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పురచ్చి తలైవి, మాజీ సీఎం జయలలిత జన్మదినమైన ఫిబ్రవరి 24న పార్టీ ఏర్పాటుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆమె మేనకోడలు దీపాజయకుమార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన శశికళ త్వరలో ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆమె తీవ్రమైన వ్యాఖ్యలను సంధించారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను అంగీకరించే ప్రసక్తే లేదని దీప ధ్వజమెత్తారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలను పలువురు కార్యకర్తలతో కలిసి ఆమె ఘనంగా నిర్వహించారు. ఎంజీఆర్ స్మారక కేంద్రానికి వెళ్లి పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు.

LEAVE A REPLY