ఏఐఏడీఎంకే పార్టీ చీఫ్‌గా శశికళ పేరు ఖరారు

0
27

తమిళనాడు ప్రజలు అమ్మగా పిలుచుకునే జయలలిత మరణం తర్వాత పార్టీ చీఫ్‌గా ఎవరు ఉండబోతున్నారనే చర్చలకు తెరపడింది. జయకు అత్యంత సన్నిహితురాలైన శశికళ ఏఐఏడీఎంకే చీఫ్‌గా ఎంపికయ్యారు. శశికళకు ఇప్పటి వరకు పార్టీలో ఎలాంటి పదవి లేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టేందుకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే నిబంధనలను సవరిస్తామని పార్టీ అధికార ప్రతినిధి సీ పొన్నాయన్ గురువారం ప్రకటించారు. జయలలిత ఆశయాల మేరకు శశికళ పార్టీని నడిపిస్తారని తెలిపారు. జయతోపాటు పోయెస్ గార్డెన్‌లో నివసించే శశికళ చిన్నమ్మగా గుర్తింపు పొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here