ఏఐఎఫ్‌ఎఫ్.. ఇక ఫుట్‌బాల్ ఇండియా

0
13

అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్‌ఎఫ్) త్వరలో కొత్త రూపు సంతరించుకోబోతున్నది. ఇన్నాళ్లు దేశంలో ఫుట్‌బాల్ కార్యకలాపాలు నిర్వహించిన ఏఐఎఫ్‌ఎఫ్ పేరు ఫుట్‌బాల్ ఇండియాగా మారబోతున్నది. తొలిసారి మహిళల ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్‌కు ఏఐఎఫ్‌ఎఫ్ మంగళవారం అంకురార్పణ చేసిన సందర్భంగా ఫుట్‌బాల్ సమాఖ్య చీఫ్ ప్రఫుల్ పటేల్ ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో పటేల్‌తో పాటు కేంద్ర క్రీడామంత్రి విజయ్ గోయల్, ఏఐఎఫ్‌ఎఫ్ మహిళల డివిజన్ చైర్‌పర్సన్ సారా పైలెట్ పాల్గొన్నారు. ఈ నెల 28న మొదలయ్యే మహిళల సాకర్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. వచ్చే నెల 14న ఫైనల్ జరుగుతుంది.

LEAVE A REPLY