ఏఈల ప్రమోషన్లపై కమిటీ

0
22

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఏఈల ప్రమోషన్లపై టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్ ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు రూపొందించిన ఏఈల సీనియారిటీ జాబితాను కమిటీ పరిశీలిస్తుందని పేర్కొన్నారు. 10రోజుల్లో కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వులు, సుప్రీంకోర్టులోని స్పెషల్ లీవ్ పిటీషన్, సర్వీస్ నిబంధనలను పరిశీలించి నివేదిక తయారు చేయాలని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా, సంఘాల వారిగా అభ్యంతరాలు, సూచనలను కమిటీకి సమర్పించాలని తెలిపారు.

LEAVE A REPLY