ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి

0
10

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పేరును ఇకపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి పేరుతో పిలువనున్నారు. ఈ నిధులను దళితులు, గిరిజనుల కుటుంబాలు, ఆవాసాలకు మాత్రమే ఉపయోగపడేలా వాడాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో సాధారణ పనులు, పథకాల ద్వారా చేసే ఖర్చు ఆ గ్రామానికి ఉపయోగపడితే సంబంధిత శాఖ నిధులే వినియోగించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం 2013 సవరణ కోసం సీఎం కేసీఆర్ నియమించిన దళిత, గిరిజన కమిటీలు సంయుక్తంగా శనివారం సర్వశిక్షా అభియాన్ సమావేశ మందిరంలో భేటీ అయ్యాయి. ఎస్టీ కమిటీ చైర్మన్ చందూలాల్, ఎస్సీ అభివృద్ధి మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించేందుకు సమావేశం నిర్వహించారు. గతంలో సబ్‌ప్లాన్ కింద కేటాయించిన నిధులు ఖర్చు చేయకుంటే రద్దు అయ్యేవని, ఇకపై వాటిని వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించేలా ప్రతిపాదనలు చేసినట్లు కడియం శ్రీహరి తెలిపారు.

LEAVE A REPLY