ఎస్పీలో చీలిక అనివార్యమైన పక్షంలో కాంగ్రెస్ మద్దతుతో

0
30

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కోసం యూపీలో అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీ యువనేత, సీఎం అఖిలేశ్ యాదవ్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం సమసిపోకపోతే, పార్టీలో చీలిక అనివార్యమైతే కాంగ్రెస్ మద్దతు తీసుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకోవడానికి తన తండ్రి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్‌తో కుస్తీ పడటంలో తీరిక లేకుండా ఉన్న ఆయన ఇందుకోసం తన భార్య డింపుల్ యాదవ్(38)ను రంగంలోకి దింపారు. డింపుల్ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. 2012లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఎంపీ అయ్యారు. పార్లమెంటులోనూ బయటా ఆమె అరుదుగానే మాట్లాడారు. భర్త అఖిలేశ్ వెంటే ఎక్కువగా ఉండటానికి ఆమె పరిమితమయ్యారు.

LEAVE A REPLY