ఎస్టీ కమిషన్ చైర్మన్ నంద్‌కుమార్ బాధ్యతల స్వీకరణ

0
17

జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎస్టీ) చైర్మన్‌గా నంద్‌కుమార్ రాయ్ (71) బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి పదవి ర్యాంకు స్థా యి హోదాతో ఈ పదవిలో మూడేండ్లు కొనసాగుతా రు. మారుమూల ప్రాంతా ల్లోని ఎస్టీల హక్కులను కాపాడేందుకు కృషిచేస్తానని ఆయన అన్నారు. షెడ్యూల తెగల సామాజిక, ఆర్థికాభివృద్ధిలో తమ కమిషన్ కీలకపాత్ర పోషిస్తున్నదని చెప్పారు. 1977, 1985, 1998 మధ్యప్రదేశ్ శాసనసభకు నంద్‌కుమార్ ఎన్నికయ్యారు. 2000 ఏడాదిలో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఎన్నికై మొదటి ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 1989, 1996, 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.

LEAVE A REPLY