ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యంతో స్టేషన్ యాక్సెస్ అండ్ మొబిలిటీ చాలెంజ్

0
8

మెట్రో రైల్ ప్రారంభించగానే ట్రాఫిక్ సమస్య తీరదని, ఫస్ట్ మైల్ నుంచి లాస్ట్ మైల్ వరకు కనెక్టివిటీ ఉండాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. శనివారం ప్రభుత్వం, మెట్రో రైల్, ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యంతో స్టేషన్ యాక్సెస్ అండ్ మొబిలిటీ చాలెంజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మెట్రో ఎండీ మాట్లాడుతూ మెట్రోకి అనుగుణంగా పార్కింగ్, రవాణా సౌకర్యం ఉండాలన్నారు. డబ్ల్యూఐ, టొయోటా మొబిలిటీ ఫౌండేషన్‌తో కలిసి సరికొత్త ఆలోచనలతో మెట్రోను ఆధునీకరిస్తామని చెప్పారు. స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్ చార్జింగ్ సేవలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో మియాపూర్‌లో ఎలక్ట్రికల్ చార్జింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY