ఎల్బీ స్టేడియం పూర్తిగా క్రీడాకార్యక్రమాలకే

0
15

స్టేడియంలో దుకాణాలు తొలిగిస్తాం శాసనసభలో క్రీడామంత్రి పద్మారావు ప్రకటన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎల్బీ స్టేడియంలో ఉన్న దుకాణాలను తొలిగిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గురువారం శాసనసభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. స్టేడియం చుట్టూ అనేక దుకాణాలు వెలిసాయనీ, ఇవి క్రీడాకారులకు ఇబ్బందిగా మారాయనీ ఎప్పటినుంచో ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదులపై ఇప్పటికే ఎన్నోసార్లు దుకాణాదారులతో చర్చలు జరిపామనీ, కానీ వాళ్లు కోర్టును ఆశ్రయించారని మంత్రి వెల్లడించారు. ఇది న్యాయపరిధిలో ఉన్నందున అడ్వకేట్ జనరల్‌తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఎల్బీ స్టేడియాన్ని పూర్తిగా క్రీడాకార్యక్రమాలకే వినియోగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి స్టేడియం ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. స్టేడియాల కోసం స్థల పరిశీలన జరుగుతున్నదన్నారు.

LEAVE A REPLY