ఎరువులు, విత్తనాల దుకాణాల్లో స్వైపింగ్ మెషీన్లు!

0
26

నగదు రహిత లావాదేవీల దిశగా రాష్ట్ర వ్యవసాయశాఖ అడుగులు వేస్తున్నది. ఎరువులు, విత్తనాల దుకాణాల్లో 15 రోజుల్లో స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారులను వ్యవసాయశాఖ ఆదేశించినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 5,721 ఎరువులు, 9 వేల విత్తన దుకాణాల్లో స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు స్పష్టంచేశారు. అప్పటివరకు రైతులకు ఇబ్బంది లేకుండా సాధారణ కొనుగోళ్లకు అనుమతించాలని చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో స్వైపింగ్ మెషీన్ల ఏర్పాటు, సాంకేతిక అంశాల్లో సహకరించాల్సిందిగా కోరుతూ వ్యవసాయశాఖ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here