ఎయిరో క్యాంపస్‌తో ఉపాధి!

0
17

హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిరో క్యాంపస్ ఏర్పాటుకు ఆక్వటైన్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంతో హైదరాబాద్ బేగంపేటలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఎయిరో స్కిల్స్ అకాడమి ఏర్పాటు చేయనున్నది. దీంతో యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ మేరకు బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బీవీ పాపారావు సమక్షంలో ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పరిశ్రమలు, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఎయిరో క్యాంపస్ ఆక్వటైన్ సంస్థ జనరల్ మేనేజర్ జీరోమీవర్ష్ యావ్ సంతకాలు చేశారు. ఒప్పందం అనంతరం స్కిల్ గ్యాప్, కోర్సులను రూపకల్పన చేస్తారు. ఈ అకాడమిలో శిక్షణ పొందిన విద్యార్ధులకు యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈసా), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)లు ధ్రువపత్రాలు అందజేయనున్నాయి. కోర్సులకు అనుగుణంగా ప్రాక్టికల్స్ శిక్షణ ఇవ్వడానికి ఏవియేషన్ సంస్థలతో ఒప్పందం చేసుకోనున్నారు.

LEAVE A REPLY