ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అఖిలేశ్

0
14

ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సమాజ్‌వాదీ పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో చేర్చి లబ్ధి పొందాలనుకుంటున్నదని ఆయన మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చిన అచ్ఛేదిన్ (మంచి రోజులు) ఇంకా రాలేదన్నారు. ప్రజలకు చీపుర్లు ఇచ్చి ఊడ్చాలని చెబుతున్నారని లేదా యోగా చేయాలని అంటున్నారని ఆయన విమర్శించారు. నోట్లరద్దును ఆయన తీవ్రంగా ఎండగట్టా రు. ఆ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 403అసెంబ్లీ సీట్ల లో 300 పైనే సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాల గురించి ఆయన ఓటర్లకు వివరించారు. 2012లో ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చామని అఖిలేశ్ పేర్కొన్నారు.

LEAVE A REPLY