ఎన్నికల్లో సైబర్‌ దాడుల వెనుక పుతిన్‌: ఒబామా

0
25

వాషింగ్టన్‌: తమ దేశ ఎన్నికల సందర్భంగా జరిగిన సైబర్‌దాడుల వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సూచనలతోనే ఇవి జరిగి ఉంటాయని చెప్పారు. శ్వేత సౌధంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో డెమొక్రాటిక్‌ పార్టీ ఈ-మెయిళ్లు దాడికి గురయ్యాయని చెప్పారు. ఇవేవీ వివాదాస్పదమయినవి కానప్పటికీ, కొంతకాలంపాటు రహస్యంగా ఉంచాలనుకున్నవి కొన్ని ఉన్నాయని అన్నారు. ‘రష్యావాళ్లు మమ్మల్నేమీ మార్చలేరు. అది చాలా చిన్న దేశం. బలహీనమైనది. ఎవరికి ఏమి కావాలో వాటిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఆ ఆర్థిక వ్యవస్థకు లేదు’ అని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY