ఎన్నికల్లో పోటీ చేయడం లేదు

0
21

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్ ప్రకటించారు. లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం హడావుడిగా నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో అఖిలేశ్‌యదవ్ మాట్లాడుతూ లక్నోలోని సరోజినీనగర్ స్థానం నేను పోటీ చేస్తున్నట్లు కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేస్తున్నాయి. నేను ఎక్కడి నుంచీ పోటీ చేయడం లేదు. 2018 వరకు నేను ఎమ్మెల్సీని. అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాను అని పేర్కొన్నారు.

రేపు రాహుల్, అఖిలేశ్ సంయుక్త విలేకరుల సమావేశం

లక్నోలో ఆదివారం సంయుక్త విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, ఆయన భార్య డింపుల్‌యాదవ్‌లు మాట్లాడనున్నారు. బీజేపీ, బీఎస్పీ నుంచి ప్రధానంగా పోటీ ఎదురయ్యే స్థానాల్లో జరిగే ఎన్నికల ర్యాలీలో రాహుల్‌గాంధీ, అఖిలేశ్‌లు కలిసి పాల్గొననున్నారు.

LEAVE A REPLY