ఎన్నికల్లో ఓడిన వ్యక్తికి ఏం ప్రతిష్ఠ?

0
19

పరువునష్టం కేసులో రెండోరోజు మంగళవారం కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జెట్లీని ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మాలానీ ప్రశ్నించారు. తన కీర్తి ప్రతిష్ఠలకు భం గం వాటిల్లిందని సోమవారం జైట్లీ పేర్కొన్న విషయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు ఏ కీర్తి ప్రతిష్ఠల గురించి మాట్లాడుతున్నారు. 2014 ఎన్నికల్లో మీరు ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి కీర్తి ప్రతిష్ఠల గురించి మాట్లాడటమా? అని ప్రశ్నించారు. దీనికి జైట్లీ సమాధానమిస్తూ 2014 ఎన్నికల్లో మీ ైక్లెయింట్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయా రు. ఈ విషయాన్ని మర్చిపోయారా? అయినా ఎన్నికలు పార్టీ విధాన నిర్ణయానికి అనుగుణంగా జరుగుతుంటాయి. ఓ వ్యక్తి కీర్తి ప్రతిష్ఠలకు, ఎన్నికలకు ముడిపెట్టడం సరికాదు అని అన్నారు.

వెంటనే జెఠ్మాలానీ మరో ప్రశ్న సంధిస్తూ.. హైకో ర్టు డిప్యూటీ రిజిస్ట్రార్‌కు రాసిన లేఖలో గుడ్‌విల్ అనే పదా న్ని ఉపయోగించారు. సోమవారం కీర్తి ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ రెండు పదాలకు మధ్య తేడా గురించి మీకు తెలుసా? అని నిలదీశారు. జైట్లీ స్పందిస్తూ గుడ్‌విల్, కీర్తి ప్రతిష్ఠలు అనే రెండు పదాలకు దగ్గరి సంబంధం ఉన్నదని చెప్పారు. ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అరుణ్‌జైట్లీ అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్, ఆప్ నాయకులు గతంలో ఆరోపించిన నేపథ్యంలో జైట్లీ పరువునష్టం కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు హాలులో కేజ్రీవాల్ తరఫున రాం జెఠ్మాలానీ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here