ఎన్టీఆర్ పక్కన రాశీ కన్ఫర్మ్..

0
28

ఇంకో పది రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కాబోతోంది. దీంతో సినిమాకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ను కల్యాణ్ రామ్.. తన నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తరఫున ట్విట్టర్‌లో తెలియజేస్తున్నాడు. తాజాగా సినిమాలో హీరోయిన్లకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ఇచ్చాడు కల్యాణ్‌రామ్. సినిమాలో తారక్‌కు జోడీగా రాశీ ఖన్నా నటిస్తోందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దానిని అధికారికంగా ధ్రువీకరించాడు చిత్ర నిర్మాత అయిన కల్యాణ్ రామ్. తన నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా రాశీ ఖన్నా ఫొటోను పోస్ట్ చేసి.. ఆ విషయాన్ని వెల్లడించాడు. ఎన్టీఆర్ 27వ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటిస్తున్న రాశీ ఖన్నాకు స్వాగతం అంటూ ట్వీట్ చేశాడు. మూడు పాత్రల్లో నటిస్తున్న ఎన్టీఆర్ పక్కన నటించే మిగతా ఇద్దరు హీరోయిన్లు ఎవరో కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. ఇక, ఇప్పటికే సినిమాటోగ్రాఫర్‌గా బాలీవుడ్ ప్రముఖ కెమెరామెన్ సీకే మురళీధరన్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చే ఈ సినిమాకు బాబి దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here