ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో

0
20

ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ పంపిణీదారుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా మారుతూ యువసుధ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పంపిణీదారుడిగా పనిచేశాను. నా చిన్ననాటి స్నేహితుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయడం ఆనందంగా వుంది. అత్యంత భారీస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో నటిస్తున్నారు. తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే చిత్రం సెట్స్‌మీదకు వెళ్తుందని సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here