ఎన్టీఆర్‌ విగ్రహానికి అవమానం

0
16

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహానికి అవమానం జరిగింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. మంగళవారం తెల్లవారుజామున దీనిని గుర్తించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ.. నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ చేసి, జన్మభూమి సభను అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన తదితరులు ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

LEAVE A REPLY