ఎన్టీఆర్‌ జీవితచరిత్రపై త్వరలోనే సినిమా

0
24

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను త్వరలోనే సినిమా తెరకెక్కించనున్నట్లు ఆయన కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఎన్టీఆర్‌ పాత్రలో తానే నటిస్తానని చెప్పారు. సినిమాపై పరిశోధన జరుగుతోందని.. త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్నారు. ఎన్టీఆర్‌ స్వగ్రామమైన కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో నారా లోకేశ్‌తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు.

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ జీవిత విశేషాలను పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్‌ చేశారు. తనకు నిమ్మకూరు.. హిందూపురం రెండూ సమానమేనన్నారు. తన పీఏపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని.. పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

LEAVE A REPLY