ఎన్టీఆర్‌తో అనుపమ

0
21

లయాళం ముద్దుగుమ్మ అనుపమ తెలుగు చిత్రసీమలో ఇక జెండా పాతేసినట్టే. ఒక సినిమా పూర్తవ్వగానే మరొక కీలకమైన అవకాశాన్ని సొంతం చేసుకొంటోందామె. ‘అఆ’, ‘ప్రేమమ్‌’ చిత్రాలతో అదరగొట్టిన అనుపమ త్వరలోనే ‘శతమానం భవతి’తో సందడి చేయబోతోంది. తదుపరి ఎన్టీఆర్‌తో కలిసి ఆడిపాడే అవకాశాన్ని కూడా చేజిక్కించుకొన్నట్టు తెలిసింది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అందులో ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో కనిపిస్తారని, ఆయన సరసన ముగ్గురు కథానాయికలూ నటిస్తారని ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్టీఆర్‌ సరసన ఓ కథానాయికగా అనుపమ అవకాశాన్ని చేజిక్కించుకొన్నట్టు తెలిసింది. అదే నిజమైతే ఆమె స్టార్‌ భామల సరసన చోటు సంపాదించినట్టే.

LEAVE A REPLY