ఎనిమిదేళ్ల పోలీసుల ఎదురుచూపులకు మోక్షం

0
7

అర్బన్, రూరల్‌ జిల్లాల పోలీస్‌ సిబ్బందికి త్వరలో తీపి కబురు అందనుంది. ఎనిమిదేళ్లుగా నలుగుతున్న పోలీస్‌ సిబ్బంది విభజన ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రూరల్‌ ఎస్పీ సీహెచ్‌. వెంకటప్పలనాయుడు పారదర్శకంగా జాబితాను సిద్ధం విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఓ వైపు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ ప్రక్రియను వేగవంతం చేశారు. జాబితాలో పొరపాట్లు, విమర్శలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈనెల 12న సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్వీకరించిన వినతులు, ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చారు. వాటి ఆధారంగా సమస్యలు లేకుండా జాబితాను సవరించే పనిలో ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. నేడో, రేపో తుది జాబితాను రూపొందించి ఉన్నతాధికారుల అనుమతితో విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొం దించారు.

LEAVE A REPLY