ఎనభై కథల్ని విన్నాను!

0
19

పంచ్‌డైలాగ్‌లు విసురుతూ, చక్కటి టైమింగ్‌తో కామెడీని పండించడంలో దిట్ట హాస్య నటుడు శ్రీనివాస్‌రెడ్డి. తనదైనశైలి వినోదంతో ఆయన తెలుగుప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. శివరాజ్ ఫిల్మ్స్ పతాకంపై శివరాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి నిర్మిస్తున్నారు. శివరాజ్ కనుమూరి దర్శకుడు. ఈ నెల 25న విడుదలకానుంది. నేడు శ్రీనివాస్‌రెడ్డి జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మంగళవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో సంభాషించారు.

LEAVE A REPLY