ఎదిగిన మరో అందం… రకుల్‌ప్రీత్‌ సింగ్‌.

0
58

డిసెంబరు అనగానే ఆ యేడాదంతా చేసిన పని కళ్ల ముందు మెదులుతుంది. సాధించిన విజయాలకు సంబరాలు చేసుకొంటాం. ఆ రకంగా ఇది నాకు సంబరాల సమయమే. ‘ధృవ’ రూపంలో మంచి విజయం లభించింది. అందుకే కొత్త సంవత్సర వేడుకల్ని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకొన్నా’’.   * ‘‘ధృవ’ నాకు ప్రత్యేకమైన సినిమా. సగటు తెలుగు చిత్రాల్లా కాకుండా తెలివైన స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏ సినిమా విడుదలైనా తప్పకుండా చూస్తా. అలా చూసిన ‘తని ఒరువన్‌’ బాగా నచ్చింది. అది తెలుగులో రీమేక్‌ అవుతుందని, అందులో నేను నటిస్తానని వూహించలేదు. ‘ధృవ’ ప్రేక్షకులకు చేరువ కావడం సంతృప్తినిచ్చింది’’.\

‘‘ఒక సినిమా రీమేక్‌ అయినప్పుడు మాతృకతో పోల్చి చూడటం సహజం. నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోను. ఒక కొత్త పాత్రని చేస్తున్నట్టుగానే భావించి సెట్‌కి వెళతా. ‘ధృవ’ని అలాగే చేశా. ఇందులో నటించడాన్ని ఎంతగానో ఆస్వాదించా. ‘పరేషానురా…’ పాటకి మంచి స్పందన లభిస్తోంది. ఆ పాట కోసం చాలా కష్టపడ్డా. నాలుగు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు కూడా తాగకుండా ఆ పాటలో నటించా. దాహం వేసినప్పుడు రెండు పుచ్చకాయ ముక్కలు తినేదాన్నంతే. పొట్ట భాగం ఎత్తుగా కనిపించకూడదనే ఆ ప్రయత్నం. ఆ పాట గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొంటుంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించినట్టుగా ఉంది’’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here