ఎట్టకేలకు ఇంటికి చేరుకున్న సెల్వరాజ్‌

0
20

దిల్లీ: పనికోసం దుబాయ్‌ వెళ్లి అక్కడి నుంచి తిరిగి రాలేక నరకయాతన అనుభవించిన తమిళనాడుకు చెందిన జగన్నాథన్‌ సెల్వరాజ్‌ మంగళవారం తన ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. దుబాయ్‌ నుంచి వచ్చేందుకు చేతిలో డబ్బులు లేక టికెట్‌ కొనివ్వండంటూ సెల్వరాజ్‌ అక్కడి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం 22 కి.మీ. దూరం నడిచి కోర్టుకు హాజరయ్యేవాడు. అలా అతడు సంవత్సర కాలంలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు నడిచాడు. విదేశంలో పలు కష్టాలు అనుభవిస్తున్న సెల్వరాజ్‌ గురించి ఓ సామాజిక కార్యకర్త కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ దృష్టికి తెచ్చారు.

ఆమె దుబాయ్‌లో ఉన్న భారత దౌత్య అధికారులతో మాట్లాడి సెల్వరాజ్‌ను భారత్‌ తిరిగి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అలా ఎట్టకేలకు కేంద్ర మంత్రి సహాయం ద్వారా సెల్వరాజ్‌ తన ఇంటికి క్షేమంగా చేరుకున్నందుకు కుటుంబసభ్యులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. విదేశాల్లో చిక్కుకొని ఉన్న భారతీయుడిని రక్షించి మరోసారి మంత్రి సుష్మ తన సేవా గుణాన్ని చాటుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here