ఎక్కువ మొత్తం పెట్టేవారికి మరో చాన్స్‌

0
19

అగ్రిగోల్డ్‌ సంస్థకు చెందిన వివాద రహిత ఆస్తులను హైకోర్టు వేలం వేసింది. కృష్ణా జిల్లా కీసర మండలంలోని వివాదాస్పదం కాని 4 ఆస్తులను జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎస్‌.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం వేలం వేసింది. కీసర సమీపంలో అగ్రిగోల్డ్‌ సంస్థ పేరిట ఉన్న 341 ఎకరాలను 11 లాట్లుగా విభజించి వేలానికి ఉంచగా వాటిలో 4, 6, 7, 8, 10, 11 లాట్లకు బిడ్లు వచ్చాయి. బిడ్లు వచ్చిన ఆస్తుల్లో 4, 6 లాట్లకు బ్యాంకు రుణాలు ఉండడంతో వాటిని మినహాయించి ఎలాంటి వివాదం లేని ఆస్తులకు ధర్మాసనం వేలం నిర్వహించింది. 7వ లాట్‌లోని 23.84 ఎకరాలకు సంబంధించి 14 బిడ్లు వచ్చాయి. ఈ ఆస్తికి కోర్టు రిజర్వు ధర రూ.3.30 కోట్లుగా నిర్ణయించగా అత్యధికంగా రూ.5..67 కోట్లకు బిడ్‌ వచ్చింది. ఈ ధరను ప్రాథమికంగా వేలానికి పెట్టింది.

LEAVE A REPLY