‘ఎక్కడ నా ప్రాణం’ అంటున్న నాని

0
66

నాని కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేను లోకల్‌’ చిత్రంలోని ‘అరెరే ఎక్కడ నా ప్రాణం..’ అనే పాట వీడియో విడుదలైంది. మెలోడీగా సాగే ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. సోమవారం రాత్రి విడుదల చేసిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో 13వ స్థానంలో ఉంది. 1.14 నిమిషాల ఈ వీడియోను దాదాపు 2.5 లక్షలకుపైగా వ్యూస్‌ లభించాయి. ఈ చిత్రానికి సెన్సారు బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్‌ లభించినట్లు నాని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

కీర్తీసురేశ్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శిరీష్‌ నిర్మించారు. దిల్‌రాజు సమర్పిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. నవీన్‌ చంద్ర ముఖ్య భూమిక పోషించగా, ఫిబ్రవరి 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here