ఎంత డిపాజిట్‌ చేస్తే అంత టాక్‌టైమ్‌..

0
22

సేవింగ్స్‌ ఖాతా కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో భారతి ఎయిర్‌టెల్‌కు చెందిన ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా తమ వద్ద కొత్తగా తెరిచే సేవింగ్స్‌ ఖాతాలో కస్టమర్‌ డిపాజిట్‌ చేసే ప్రతి రూపాయికి ఒక నిమిషం టాక్‌టైమ్‌ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ టాక్‌టైమ్‌ సంబంధిత కస్టమర్‌ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నెంబర్‌కు క్రెడిట్‌ అవుతుంది. మొదటిసారి చేసే డిపాజిట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని శుక్రవారంనాడు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఉదాహరణకు ఒక కస్టమర్‌ ప్రారంభించిన సేవింగ్స్‌ ఖాతాలో 1,000 రూపాయలు డిపాజిట్‌ చేస్తే ఆ కస్టమర్‌ తన ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నెంబర్‌కు 1,000 రూపాయల ఉచిత టాక్‌టైమ్‌ను పొందుతాడు.

LEAVE A REPLY