ఎంగేజైన సెరీనా విలియ‌మ్స్‌

0
38

వాషింగ్ట‌న్‌: టెన్నిస్ స్టార్ సెరీనా విలియ‌మ్స్ ఎంగేజ్ అయ్యింది. సోష‌ల్ సైట్ రెడ్డిట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు అలెక్సిస్ ఒహ‌నియ‌న్‌ను పెళ్లి చేసుకోనుంది. ప్ర‌స్తుతం ఒహ‌నియ‌న్‌తో సెరీనా డేటింగ్ చేస్తోంది. త‌న ఎంగేజ్‌మెంట్ విష‌యాన్ని సెరీనా రెడ్డిట్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించింది. ఇద్ద‌రూ ఇటీవ‌లే రోమ్‌లో విహ‌రించారు. ఎంగేజ్‌మెంట్‌ను ప్ర‌క‌టించిన సెరీనా.. త‌న బాయ్‌ఫ్రెండ్‌పై రెడ్డిట్ అకౌంట్‌లో ఓ క‌విత‌ను కూడా పోస్ట్ చేసింది. ఇద్ద‌రి మ‌ధ్య 2015 నుంచి డేటింగ్ న‌డుస్తోంది. అయితే సెరీనా మాత్రం త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఎప్ప‌టిక‌ప్పుడు ఇద్ద‌రి ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ వ‌చ్చింది. రెడ్డిట్ సైట్ త‌న హోమ్ పేజీలో డైమండ్ రింగ్‌తో సెరీనాకు అలెక్సిస్ ప్ర‌పోజ్ చేస్తున్న కార్టూన్ కూడా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here