ఎంఎంటీఎస్‌ రెండో దశకు మొండిచేయి

0
15

ఈ ఏడాది డిసెంబరు 31లోపు ఎట్టిపరిస్థితుల్లో ఎంఎం టీఎస్‌ రెండో దశను పూర్తిచేసి తీరతామని, వచ్చే ఏడాది మొదట్లోనే రైళ్లను పట్టాలెక్కిస్తామని ఇటీవల నూతన జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన వినోద్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కేంద్ర బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ రెండో దశకు నిధుల కేటాయింపు కాదు కదా… ఈ ప్రాజెక్టు గురించి కనీసం ప్రస్తావన కూడా లేకపోవడం అందరినీ నిశ్చేష్టులను చేసింది. సికింద్రాబాద్‌- భువనగిరి, సికింద్రాబాద్‌- మనోహరాబాద్‌, ఉందా నగర్‌- శంషాబాద్‌ విమానాశ్రయం, మౌలాలి- సనత్‌నగర్‌ బైపాస్‌ మార్గాల్లో చేపడుతున్న రెండో దశ కోసం 817 కోట్లు వ్యయం అవుతుంది. ఇప్పటి వరకు 302 కోట్ల వరకు ఖర్చయింది. రెండో దశ పనులు ప్రస్తుతం 50 శాతం వరకే పూర్తి కావడం, తాజా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు లేకపోవడంతో… నిర్దేశిత గడువులోపు ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టు పూర్తి కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY