ఊరూరా కొనుగోలు కేంద్రాలు

0
14

ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో ఉన్న జగిత్యాల జిల్లా మొదటి నుంచీ వ్యవసాయంపైనే ఆధారపడింది. గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురువడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు జలకళను సంతరించుకొన్నది. భూగర్భజలాలు కూడా వృద్ధి చెందాయి. దీంతో యాసంగికి జిల్లాలో దాదాపు 1.35 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. 3.5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కోతలు కాకముందే జిల్లా యంత్రాంగం వరిధాన్యం కొనుగోలుపై అప్రమత్తమైంది. గతంలో మార్కెటింగ్ అధికారిగా పనిచేసిన డాక్టర్ ఏ శరత్ జిల్లా కలెక్టర్‌గా ఉండటం, ఆయనకు ధాన్యం మార్కెటింగ్‌పై అవగాహన ఉండటంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మార్కెటింగ్ అధికారులు, సహకారశాఖ అధికారులు, డీఆర్డీవో అధికారులతో సమావేశాలు నిర్వహించి, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో అప్రమత్తమైన యంత్రాంగం కొనుగోళ్లకు పూర్తి ఏర్పాట్లు చేసింది.

LEAVE A REPLY