రజనీకాంత్ స్టైల్లో విజయ్‌…

0
26

భరతన్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్‌ నటిస్తున్న ‘భైరవ’ చిత్రం పొంగల్‌ కానుకగా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పుడే 2017 పొంగల్‌కు విడుదల చేస్తామని ప్రకటించారు. అదే తరహాలో అట్లి దర్శకత్వంలో విజయ్‌ నటించబోయే 61వ చిత్రం విడుదల తేదీ కూడా ప్రకటించేసి పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఏడాది నవంబర్‌ 13న విజయ్‌ – అట్లీ కాంబినేషన్‌లో సినిమాను తెరపైకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఇది కార్యరూపం దాల్చితే ఈ ఏడాదిలో విజయ్‌ నటించిన రెండు సినిమాలు విడుదలవుతాయి. ‘భైరవ’లో ద్విపాత్రాభినయం చేసిన విజయ్‌ తొలిసారి విగ్‌ పెట్టుకుని నటించారు. ఆ విగ్‌ వెనుక చాలానే కథ ఉందట. సాధారణంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్ చిత్రాల్లో పోరాట సన్నివేశాల్లో రజనీకాంత్ జట్టుని స్టైల్‌గా చేతితో ఎగరేస్తూ ఉంటారు. అదే తరహాలో ‘భైరవ’లో విజయ్‌ కూడా అభిమానుల్ని అలరించబోతున్నారని యూనిట్‌ సభ్యుల సమాచారం. ఆ దృశ్యాలకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని మరింత ఆసక్తి రేపుతున్నారు. మరి, రజనీకాంత్ స్లైల్‌లో ఇలయ దళపతి ఎలా అలరిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here