ఉర్దూ, అర‌బిక్‌ల‌లో రామ‌కోటి

0
20

రామ‌కోటి రాయ‌డం ప్ర‌తి రామ‌భ‌క్తుని క‌ల‌. అలాంటి రామ‌కోటి రాసిన బుక్స్‌తో రామ జ‌న్మ‌భూమి అయోధ్య‌లోని ఓ బ్యాంకు నిండిపోయింది. ఈ బ్యాంకు పేరు ద ఇంట‌ర్నేష‌న‌ల్ శ్రీ సీతారామ్‌నామ్ బ్యాంక్‌. అయోధ్య‌లోని మ‌ని రామ్‌కీ చ‌వానీలో ఉంది. ఈ బ్యాంకులో భ‌క్తులు స‌మ‌ర్పించిన కోట్లాది రామ‌కోటి బుక్స్ ఉన్నాయి. హిందీ, సంస్కృతంలోనే కాదు.. ఉర్దూ, అర‌బిక్ భాష‌ల్లోనూ రామ‌కోటి రాయడం విశేషం. 20 ఏళ్ల కింద‌ట ఈ బ్యాంకు ఏర్పాటైంది. రామ‌కోటి రాయ‌డానికి భ‌క్తుల‌కు ఉచితంగానే నోట్‌బుక్స్ ఇస్తారు. ఇలా భ‌క్తులు రామ‌కోటి రాసి తిరిగి ఇచ్చిన బుక్స్ కోట్ల‌లో ఉన్న‌ట్లు బ్యాంకు నిర్వాహ‌కులు చెబుతున్నారు.

నోట్‌బుక్స్ తీసుకున్న భ‌క్తులు కొన్ని నెల‌లు, సంవ‌త్స‌రాలు అయిన త‌ర్వాత కూడా రామకోటి రాసి తిరిగి బ్యాంకుకు ఇచ్చి కొత్త‌వి తీసుకెళ్తారు. అంతేకాదు ఇండియాతోపాటు విదేశాల నుంచి కూడా పోస్ట్ ద్వారా ఈ నోట్‌బుక్స్‌ను ఇవ్వ‌డం, తీసుకోవ‌డం ఈ బ్యాంకులో సాధార‌ణ‌మే. ఈ బ్యాంకు డ‌బ్బుల్లో కాదు.. భ‌క్తుల సంఖ్య‌తో న‌డుస్తుంద‌ని మేనేజ‌ర్ మహంత్ పునిత్‌ రామ్‌దాస్‌ అన్నారు. రామ‌కోటి రాయ‌డం అనేది దేవుడిని త‌ల‌చుకోవ‌డానికి ఉన్న ఉత్త‌మ‌మైన మార్గంగా భ‌క్తులు భావిస్తార‌ని ఆయ‌న చెప్పారు. ఉర్దూ, అర‌బిక్‌తోపాటు ఇంగ్లిష్‌, గుజ‌రాతీ, మ‌రాఠీ భాష‌ల్లో రామ‌కోటి డిపాజిట్లు త‌మ ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here