ఉపాధ్యాయుడి హత్య కేసులో ఇద్దరి అరెస్టు

0
10

క్షణిక సుఖం మాయలో చిక్కుకోవడంతో ఓ ఇల్లాలి గాజుల చేతికి బేడీలు పడ్డాయి. పసుపు కుంకుమలు పణంగా పెట్టి.. కట్టుకున్న భర్తను కర్కషంగా కడతేర్చడంలో ప్రధాన పాత్ర పోషించి.. ఇద్దరు కుమారుల జీవితాలను గాలికి వదిలి.. నేడు ఆమె కటకటాల పాలైంది. మాతృదినోత్సవం రోజునే ఈ తల్లి ఇలా చట్టం ముందు నిందితురాలిగా నిల్చోవడం బాధాకరం!
ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు… తనకు నిక్షేపంలా భార్య, ఇద్దరు పిల్లలున్నా… పరాయి స్త్రీ ఆకర్షణకు లోనై.. వివాహేతర సంబంధం ఉచ్చులో చిక్కి.. ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసి చట్టం ముందు నేడు నిందితుడిగా నిల్చున్నాడు. కట్టుకున్న భార్య, పిల్లలను సమాజంలో తలెత్తుకు తిరగనీయకుండా చేశాడు. ఇతడి తప్పిదానికి ఓ వ్యక్తి ప్రాణం, నలుగురు పిల్లల జీవితాలు, ఇద్దరు మహిళల బతుకులు బలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here