ఉద్యోగుల సమస్యలన్నీ ముఖ్యమంత్రికి నివేదిస్తాం

0
19

మే నెల మొదటివారంలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్పీ సింగ్ స్పష్టంచేశారు. ఉద్యోగుల సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. వచ్చే నెల మొదటివారంనాటికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్సీ) ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నింటికీ ప్రాధాన్యం కల్పిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. మంగళవారం ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో సమావేశమైన సీఎస్.. ఉద్యోగుల సమస్యలన్నింటిపైన విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు తెచ్చుకున్నవని, ప్రభుత్వాన్ని భుజాలమీద మోస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ఉద్యోగసంఘాల నేతలు పేర్కొన్నారు. సోమవారం జరిగిన సమావేశం సందర్భంగా సీఎస్ హామీ ఇచ్చిన మేరకు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో మంగళవారం ప్రత్యేకంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులతో కలిసిమెలిసి ఉండే స్నేహపూర్వక ప్రభుత్వమని చెప్పారు. మే మొదటి లేదా రెండో వారం నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY