ఉద్యోగులంతా నా కుటుంబమే!

0
26

రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులు చేస్తున్న త్యాగాలను మరవలేమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత నాది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహకరించే బాధ్యత మీది’ అని సీఎం ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులంతా తన కుటుంబ సభ్యులని, తాను కుటుంబ పెద్దలా వ్యవహరిస్తానన్నారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన సీఎంకి ప్రభుత్వ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులు సర్దుకుపోవాలని.. భవిష్యత్తులో మనందరికీ మేలు జరుగుతుందన్నారు. ప్రపంచం మెచ్చేలా రాజధానిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర చరిత్రలో ఈ రోజు నుంచి ఒక కొత్త శకం ప్రారంభమైనట్టు భావించాలన్నారు. రాజధాని కోసం తెలుగువారు పడినన్ని కష్టాలు మరొకరు పడి ఉండరని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here